భారత్ కే సరికేసరి!: - డా పివిఎల్ మబ్బారావు.-విజయనగరం, 9441058797..
నా పంచపదుల సంఖ్య---
          2087-2088.

2087.
లాల్,బాల్,పాల్ త్రయాన, జేష్టుడు పంజాబ్ కేసరి!

ఆ లాల్ మెరుపు కోటి ,
కోహినూర్లైనా చాలవు మరి!

దేశ లజ్  పతి సైమన్ ,
కమిషన్ నిరోధ గిరి!

తీవ్రవాద భావ సమ్మోహన, రాయ్ సమరాన శౌరి!

మెత్తదనం వీడి తీవ్రవాద,
 దారి నాయకుల సిరి,పివిఎల్!

2088.

లాహోర్ లో న్యాయవిద్య,
సమరయోధుల సాంగత్యము!

స్వామి దయానంద్ సరస్వతి, ఉద్యమ భాగస్వామ్యము! 

సైమన్  గో బ్యాక్ నినాదం,
చేసె ఉద్యమం ఉదృతము!

వ్యక్తిగత లాఠీ చార్జ్,
అతడి వాక్కులు.  అమరము!
 
బ్రిటిష్ రాజ్ శవపేటిక,
మేకులే లాఠీ దెబ్బలు,
పివిఎల్!
_________


కామెంట్‌లు