హలం నడవాలి! అన్నం కలగాలి!:- డా పివిఎల్ సుబ్బారావు. విజయనగరం. 9441058797.
 1..
అన్నదాత చేతి సంచారి !
అతడి పొలాన సహచరి! 
విత్తుకై చేయు సానుకూలదారి! 
ఎద్దులతోడ నడవ మంగళకరి! 
సర్వజన ధనధాన్య ప్రధానకరి!
2.
ఆకలి గోవర్ధనం !
ఎత్తి జనుల కాచే హల్ ధారి!
ఆనాటి రేపల్లె బాలశౌరి!  
దిగొచ్ఛిన గోపాల గిరిధారి.!
వ్యవసాయాన సూత్రధారి! 
3.
     నాగలి గీత!
    
  పుట్టిన సీత !
   
  జనక సుత!
  
   రామ ఘనత!
  
   అగ్నిపునీత!
4.
నాగళ్ళు ఉన్న వాకిళ్లు !
పంటల విశాల లోగిళ్ళు!
నిండుగా ఉన్న గాదెలు!
నిండుకోని వారి యెదలు! 
నడిచే నాగలి ,తిరిగే తిరగలి,! 
దంచే రోకలి తీరుస్తాయి ఆకలి!
5.
నాగలి పట్టిన రైతే బాహుబలి! 
తరతరాల స్వేద ధారల ఝరి!
గోరుముద్ద తినిపించే,
తల్లుల చేతి వెండిగిన్నె రైతన్న! 
తినే చిన్నారుల భువి, చందమామ ,ఈ మేనమామ!
_________


కామెంట్‌లు