నా పంచపదుల సంఖ్య---2107-2011.2107.భూజాత జనక సుత, రఘురామ హృదయ విజేత!దశరథ గృహలక్ష్మి ,సూర్యకుల దీపకుల మాత!యుగయుగాలకు ఆదర్శం, పడతిగా ఆమె నడత!వాల్మీకిమాట ,రామాయణం,పతివ్రత సీతచరిత!కష్టకాలం మహిళలు, సీతాస్మరణం భవహరణం, పివిఎల్!2108.ఆటగా శివధనస్సు ,నెట్టిన తనయ!శివుని విల్లు ,రాముడెత్తిన ఆ ఘడియ!సీత గుండె ,తలుపులు తెరవ గడియ!వారి కళ్యాణం,లోక కళ్యాణమై అరయ!ఆదర్శ దంపతులుగా ,జగాన మెరియ, పివిఎల్!2109.రాముడు ఉన్నదే అయోధ్య, నమ్మిన పరమ విధేయ!ప్రీతిగా వనవాసానికి,పతి వెంట తాను నడయ!రామసహవాసం వనవాసాన,ఎంతగానో మురియ!పంచవటి తీరాన పర్ణశాల,ఆనందమే కురియ!ఓనాడు బంగారు లేడి,కని పతిని కోరే మగువ, పివిఎల్!2110మాయలేడి రచన ,సీతాపహరణ సాధన!క్రూర రాక్షస స్త్రీల మధ్య, జింకపిల్ల చందాన !అశోకవనం అనుక్షణం, మరణమే యాతన!హనుమ ప్రవేశం,ఊరటివ్వగ రామకీర్తన!అంగుళీయం పొంది,పంపగ చూడామణి సాంత్వన, పివిఎల్!2111రామ శరవేగాగమనం,రావణ కుల నాశనము!రామకోర అగ్ని ప్రవేశం,,చేసే అగ్నిని పునీతము!అయోధ్య ఆగమనం, పట్టాభిషేకం నిందారోపణము!గర్భిణి వనవాసం,చేరె వాల్మీకి ఆశ్రమ నివాసం!లవకుశ,తండ్రిఅప్పగించి,తాను, అమ్మ ఒడి చేరే ,పివిఎల్!________
సీత-సద్గుణ భరిత.:- డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం, 9441058797..
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి