అక్షరామృతం!:- డా పివిఎల్ సుబ్బారావు.-విజయనగరం.-9441058797.
 నేడు,నవంబర్ 7 ,2025,వందేమాతరం 150 ఏళ్లు! (నవంబర్ 7.1875)శుభాకాంక్షలతో,
=============================================================== 
1
అక్షరం చిరాయువు!
 అక్షరం ఆక్సిజన్ వాయువు! 
అక్షరం పోరాట జటాయువు!
అక్షరం జీవన చోదక శక్తి! 
అక్షరం సమస్య సాధనాయుక్తి!
2.
అక్షరాల అనన్య
 అద్భుతసమాహారం! 
బకించంద్ర కలం,
       దేశభక్తి మణిహారం! 
భారతి గళాన,
 మెరిసే అక్షర పారిజాతం!
అమర గీతం ,భావసారం!
మన వందేమాతర గీతం!
3.
నాడు దీర్ఘగీతం !
నేడు సంక్షిప్త సంగీతం! 
ఏనాడు జన జాగృతగీతం!
దేవభాష, హృదయఘోష,
సమన్వితం! 
అమృతం ఒక్క బొట్టు చాలు, బతికించడానికి!
 ఆ గీతం ఒక్క అక్షరం చాలు, నడిపించడానికి!
4.
నిత్యం అందాం, విందాం!
 పరమార్థం తెలుసుకుందాం! 
దేశభక్తి గంగాజలాన,
పునీతులమవుదాం !
ప్రతినపూనుదాం!
బతుకు దేశానికి సమర్పిద్దాం!
వందేమాతరం !
తరించు ప్రతి తరం!
________


కామెంట్‌లు