ఒకే దేశం,ఒకే ఆత్మ,ఒకే లక్ష్యం ఆశయంతో ఎన్నో స్వతంత్ర సంస్థానాలు విలీనం చేసి స్వతంత్ర భారతాన్ని తీర్చిదిద్దిన ఉక్కుమనిషి , భారతదేశపు మొట్టమొదటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కంచిలి మండలం బూరగాం గ్రామంనకు చెందిన గణిత అవధాని మడ్డు తిరుపతి రావు మాస్టర్ 150 సంవత్సరాల క్యాలెండరు ( 1905 నుంచి 2075) ను పోస్ట్ కార్డు పైన ఒకే వైపున ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో తయారు చేయడం జరిగింది.ఈ క్యాలెండర్ లో మూడు విభాగాలు ఉన్నాయి.మొదటి విభాగంలో సంవత్సరాలు(1905 నుంచి 2075 వరకు),రెండవ విభాగంలో నెలల పేర్లు( జనవరి నుంచి డిసెంబర్ వరకు), మూడవ విభాగంలో వారాల పేర్లు( ఆది నుంచి శని) మరియు సంఖ్యలు (1 నుంచి 37) వరకు ఇవ్వబడినవి.
తేది ఇస్తే వారం పేరు తెలుసుకోవడం ఎలా?
ఉదాహరణకు:
తే: 14.11.2025 ది ఏ వారం అవుతుంది?
మొదటి విభాగంలో 2025వ సంవత్సరంనకు అడ్డంగా,నవంబర్ నెలకు దిగువగా చూస్తే రెండు ఖండించుకొనే చోట కోడ్ 6 ఉంది. ఈ కోడ్ 6ను మనకు కావలసిన తేది 14కు కలుపగా 14+6=20 వస్తుంది. ఈ 20 ను వారంల పట్టికలో అడ్డంగా చూస్తే 20కు ఎదురుగా శుక్ర వారం ఉంది.అంటే ఈ సంవత్సరం మనకు బాలల దినోత్సవం నవంబర్ 14వ తేదీ శుక్రవారం అవుతుంది.
మరో ఉదాహరణ:
తే:26.01.2026 ది ఏ వారం అవుతుంది?
వివరణ: 2026 సంవత్సరమునకు అడ్డంగా,జనవరి నెలకు దిగువగా చూస్తే రెండు ఖండించుకొనే చోట కోడ్ 4 ఉంది. ఈ కోడ్ 4 ను మనకు కావలసిన తేది 26కు కలుపగా (26+4) 30 వస్తుంది.ఈ 30 ను వారంల పట్టికలో చూడగా 30కు ఎదురుగా సోమవారం అని ఉంది.అంటే ఈ సంవత్సరం మనకు గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీ అనేది సోమవారం అవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి