ధన్యత నొందు ఓ మనిషి !:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి
మనిసి మనిసి ఓ మా మనిసి
కొలువు కావాలని నీవు తెలిసి
కలుసుకో బాసును నీవిక కలిసి
పోవద్దు ఈపొద్దు అలసి సొలసి !

నీవు రాముని గుడిని చేరుకో
ఆ శ్రీరాముని కొలువు కోరుకో
ఇస్తాడు నీకు ఇక ఆ కొలువు
అవుతాడు రాముడు నెలవు !

శ్రీరాముని దివ్య చరితను విను
నీఆత్మా రాముని భవితను కను
రామ రామ ఓ మా శ్రీరామ అను
సీతారాముడు నీ ఎదుట నిలిచేను 

మనిసి మనిసి ఓ మా మనిషి
పాప పుణ్యములు నీవిక తెలిసి
రాముని గుడిలో భక్తులను కలిసి
ఆశ్రీరాముని మదిలో నీవిక తలసి !

ఇస్తాడు శ్రీరాముడు నీకు పుణ్యం
చేస్తాడు నీ బ్రతుకును ఇక ధన్యం
నీవు ఎరుగకున్నా పుణ్యం అన్యం
నీవు కోరుకున్నదే ఆ అనుగుణ్యం

మనిసి మనిసి నీవేగా మా మనిసి
కృషితో నాస్తి దుర్భిక్షం అని తెలిసి
అవుతావు నీవు మా మహా ఋషి
కాదప్పుడు నీ బతుకిక  ఆశామషి

మనిషి మనిషి ఓ మా మనిషి
భక్తి విలువను నీవు ఇక తెలిసి
ఆ శ్రీరాముని మదిలోన కొలువు
ఓ రామ రామ అని ఇక తలువు

తలచిన వెంటనే ఇక వస్తాడు
వరములు నీకు తానందిస్తాడు
పరమ పావనమగు నీ జీవితం
పరమ సోపానంతో ప్రభావితం

రామ రామ అని నీవు అనుకో
ఆ రాముని చరితము అనుకో
రామా రామా ఓ శ్రీ రామా అను
శ్రీరాముని నీ ఎదుటనే ఇక కను

ఓ రామాలయమును కట్టించు
శ్రీ రాముని బొమ్మను పెట్టించు 
చూసేవారికి ఇక కన్నుల పండుగ
కలిగిస్తావులే నీవు వారికి మెండుగ


కామెంట్‌లు