ఓ నా బావా !:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్.9491387977.
బావా బావా ఓ నా బావా
నా ప్రేమకు చూపవా తోవా
ఇక ఎప్పుడు ఊరికి వస్తావో
నా మనసుకు ఊరట నిస్తావో !

ప్రేమా ప్రేమా అంటారు అంతా
ఆ ప్రేమ గురించి నీవు కాస్తంత
 చెప్పవా ఓ నా ముద్దుల బావా
చెబితే తప్పక నే చేస్తా నీ సేవా !

మా చక్కని అక్క పోయినంక నీవు
మా దిక్కే చూడక ఇక నీ వున్నావు
ఎన్నాళ్ళని ఒంటరిగా జీవిస్తావిలా 
ఎప్పటికీ తీరునో  లేదో ఇక నాకలా

అమ్మకు నా మదిలో మాట చెప్పా
నా మనోగతాన్నిక పూర్తిగా విప్పా
\ నాన్న కూడా సరే అని అన్నాడిక
కావాలి  నీవు మాతో ఇక కూడిక !

నీవు వస్తే మా ఊరికి ఇక సరే సరి
 రాకుంటే తీస్తాం నీకై మేమిక దారి
ముందుగా చెపుతున్నా విషయం
అప్పటిలోగా తీర్చుకో నీ సంశయం

మా అక్క ఆశయం ఇక తీరాలంటే
అక్కపిల్లల బతుకులు పండాలంటే
నీకూ నాకూ కళ్యాణం కావాలంట
మన ప్రేమ ఫలించి పండును పంట!

అప్పుడు ఇద్దరి బ్రతుకులు బాగుపడు
చెబుతున్నా విషయం పిల్లల తోడు
ఉండవు మనకు చీకటి తెరల గోడు
సుఖ సౌఖ్యాలే ఔతావిక మనతోడు !


కామెంట్‌లు