పాలమూరు పిల్లలం
పాలు గారు మల్లెలం
ఇల్లు ఇల్లు తిరుగుతాం
పాలు పెరుగు అమ్ముతాం !
పాలమూరు మండలం
మేం బంగారు కొండలం
కారు డిక్కీలో ధూరుతాం
మేం పిల్లలమర్రికి చేరుతాం
పాలమూరు జిల్లా పిల్లలం
తేనెలూరు అల్లా మల్లెలం
కల్లలు ఎరుగని వారలం
ఎల్లలు తెలిసిన పొరలం !
పాలమూరు మా ఊరు
ఉంటుందిలే జోరుదారు
అందులోగల మెట్టుగడ్డ
మాకు జన్మనిచ్చిన గడ్డ !
మా పాలమూరు పల్లె మనసులం
మేం తేనెలూరు మల్లె సొగసులం
మనసు మనసు తెలుసుకుంటం
మేం కలసి మెలసి మసులుకుంటం
పాలమూరు ఖిల్లా పిల్లలం
తేనెలూరు గల్లా మల్లెలం
కౌలు పొలం చేసే వారలం
మేలు ఫలం తీసే పోరలం !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి