నీవే నీవే:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్9491387977 కల్వకుర్తి
నీవే నీవే నా మనసును దోచావే
నీలి మేఘాలపై వచ్చి నా మనసును నీవే.గిచ్చి
నీ ప్రేమంటే నాకెంతో పిచ్చి
రావే ఇక నా ముద్దుల లచ్చి!

ముద్దులు నాకిచ్చి పోతావు
సుద్దులే నాకిక చెబుతావో
నీ మనసును నా ముందర విప్పవే
నా వయసు పైన నీ ప్రేమ దుప్పటిని కప్పవే !
నీ వలపుల తలపుల వలలు
నే రాత్రి పగలు కంటున్నా కలలు
ఆ కలల అలలలో నువ్వు నేను తెలియాడుదాం
కిందామీదా పడుకుంటూ ప్రేమ అటలే ఆడుదాం
 నీవే నీవే నే ప్రేమించే నా మరదలా
నా మదిలోకి వచ్చి చేరావే పారేటి వరదలా
నీవే నీవే నా ప్రియ భార్యమణివి ఇక నీవే
నేనే నేనే నిను మనువాడే నీ ముద్దుల పతినీ నేనే
హద్దు పద్దు అనేది మనకు ఇక లేనే లేదు
పొద్దంతా ఒకటైతే ప్రేమకు కరువు రానేరాదు !


కామెంట్‌లు