ఓ మాయమ్మ: -గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి
అమ్మా అమ్మా ఓయమ్మ
మమ్ములకన్న మాయమ్మ
మాయమ్మ ఏమైపోయావు
మాకంటికి కనబడకున్నావు  ?

నీవు లేక ఒంటరిగా మిగిలాము
అందుకే మేం ఇక్కడ అలిగాము
అలిగిన గులిగిన ఏమిటి లాభం
తొలగదుగా నేను పెట్టిన శాపం !

నే  తెలియక చేశాను ఒక తప్పు
అదయ్యింది మీ పాలిటి ముప్పు
 అనుభవిస్తున్నాం అందుకే ఈశిక్ష
దైవం ఇలా తీర్చుకున్నాడులే కక్ష !

ఆ దేవుని రోజు రోజూ ప్రార్థిస్తున్న
మీకు నాకు విముక్తికై నే అర్థిస్తున్న
త్వరలో కరుణిస్తాడని భావిస్తున్న
తప్పని కాలయాపనిక నే చేస్తున్న !

విషయం అర్థం అయిందిగా మీకు
పడవద్దులే మీరు ఏలాంటి చిరాకు
త్వరలో సర్దుకుని  కలుసుకుందాం
శుభమస్తు అనుకొని కోలుకుందాం!


కామెంట్‌లు