శరణం శరణం శరణం అయ్యప్ప
శరణం స్వామియే మా అయ్యప్ప
ఇలలో నీవేలే ఇక మా దేవుడవు
మాకలలో మెదిలే మా భానుడవు
శరణం శరణం శరణం అయ్యప్ప
శరణం స్వామియే మా అయ్యప్ప
నీవేలే మా గుడిలో వెలసిన దైవం
ఇక నీ వస్తావులే మా ఇంటికి వైనం
శరణం శరణం శరణం అయ్యప్ప
శరణం స్వామియే మా అయ్యప్ప
సప్త లోకాల తిరిగేసిన ఓ సంచారి
పులిపైనేగా ప్రయాణపు నీ సవారి
శరణం శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం మా అయ్యప్ప
మేం కట్టిన ఇడుములు తెస్తున్నాం
హారతి పళ్లెంలో పెట్టిక నీకిస్తున్నాం
శరణం శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం మా అయ్యప్ప
కారణజన్ముడవై ఇల జన్మించావు
కలియుగ భక్తులనిక దీవించావు
శరణం శరణం ఓ మా అయ్యప్ప
శరణం స్వామియే నీ వయ్యప్ప
నీ దివ్య చరిత్రను మేం విన్నాము
భక్తుల అందరికీ వినిపిస్తున్నాము
శరణం శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం మా అయ్యప్
ఎక్కడ నీఉంటే అక్కడికి వస్తాం
మిక్కువ మక్కువతో నిను చూస్తాం
శరణం శరణం శరణం అయ్యప్ప
శరణం స్వామియే మా అయ్యప్ప
వినాయకుడి తమ్ముడవే ఇక నీవు
ఆ భక్తుల నాయకుడవై పోయావు
శరణం శరణం శరణం అయ్యప్ప
శరణం స్వామియే మా అయ్యప్ప
నీ పురాణం కలిగించునులే ఇంపు
నిను చూసేటందుకు చేస్తాం తెంపు
శరణం శరణం శరణం అయ్యప్ప
శరణం స్వామియే మా అయ్యప్ప
సదా మీ దాసులమై మేం జీవిస్తాం
నీవే ఇక మా దేవుడవని భావిస్తాం
శరణం శరణం శరణం అయ్యప్ప
శరణం స్వామియే మా అయ్యప్ప
సరైన దారిలో మము నడిపించు
మృత్యువు నుండి ఇక విడిపించు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి