నేడు ఇంట్లోనే కుప్పకూలి దివికేగిండు
కంట్లో కన్నీరు నింపి కవియై మిగిలిండు
అందెశ్రీ గారు ఇక మనకు ఇక లేడు
చిందేసిన సరిగా తాను కానరాడు!
జయ జయహే తెలంగాణ
అందెశ్రీ స్వరమాధురి వీణ
మూగబోయింది సోదరా
మనకు మిగిలింది బాధరా !
పాటలు పాడడంలో తాను ఎంతో దిట్ట
పాటలు పాడి నింపుకున్నాడు పొట్ట
పలు అవమానాల పాలై చితికినోడు
తెలంగాణ ఉద్యమ ఊపిరియై బతికినోడు !
ఇట్టి మన అందెశ్రీ గారు మనకు ఇక లేరు
అమరుడై అమరపురికి చేరుకున్నారు
గగన వీధి నుండి మనల దీవించుతాడు
గేయ గాయ గాయకుడై మనలోన జీవించుతాడు!
అందెశ్రీ గారికి ఇవ్వాలి మన అశ్రునివాళి
ఎరిగి వారు ఈ భువికి మరల తిరిగి రావాలి
అని మనమందరం ఇక కోరుకుందాం
అశ్రునివాళి తర్పణమిచ్చి ఇక తేరుకుందాం !
శోకతప్త హృదయంతో.------------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి