దేశాల చరిత్ర, గొప్ప వాళ్ల జీవిత చరిత్రలు చదవాలి. మామూలు వాళ్లంతా తమ జీవనోపాధి, తమ పిల్లలు అంత వరకే ఆలోచించుకుంటారు. అంతకు మించిన గొప్ప వాళ్ల గురించి చదివినప్పుడు,ఆలోచించినప్పుడే మనలోని గొప్ప వ్యక్తి బయటపడతాడు. అప్పుడే మనం అందరికీ ఆదర్శంగా ఉండగలుగుతాం. మనకంటూ ఓచరిత్రనుసృష్టించుకోగలుగుతాం అని పిల్లలని ఉద్దేశించి దేశ తొలి ప్రధాని నెహ్రు అనేవారు.
జవహర్‌లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న జన్మించారు. అతను గులాబీలను చాలా ఇష్టపడేవారు, అలాగే పిల్లలను చాలా ప్రేమించేవారు. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు అని జవహర్‌లాల్ నెహ్రూ నమ్మారు. పిల్లలు బాగా చదువుకుంటే అద్భుతాలు సృష్టించగలరు. పిల్లలను మనం పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పేవారు.
స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటిష్ పాలనలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న భారతదేశాన్నిస్వాతంత్ర్యానంతరం మొట్టమొదటి దేశ ప్రధానిగా పురోగమనం వైపు నడిపించడంలో ఆయన చూపించిన దార్శనికత, ఆయన ఉదాత్త భావాలు ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం చేస్తాయి. పండిట్ నెహ్రూ పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారిని దగ్గరకు తీసుకునే వారు. దీంతో పిల్లలంతా ఆయనను చాచా నెహ్రు అని పిలిచేవారు.
నెహ్రూ జయంతిని జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.ఈరోజును బాల దివస్ అని కూడా పిలుస్తారు. ఈ వేడుకలు 1956 నాటిది. ఈ రోజును ఐక్యరాజ్యసమితి ప్రకారం నవంబర్ 20న యూనివర్సల్ చిల్డ్రన్స్ డే గా పాటించారు. 1964 నెహ్రూ మరణానంతరం ఆయన జన్మదినోత్సవం, పైగా ఆయనకు ఉన్న పిల్లల పట్ల ఆయనకున్న అభిమానాన్ని స్మరించుకునేందుకు వేడుకలు జరపాలని నిర్ణయించారు. అప్పటి నుంచి మన దేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
ఆయన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ,ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి మార్గదర్శక సంస్థలను స్థాపించారు. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు. వారిని మనం పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయింస్తుందని నెహ్రూఅన్నారు.మనుషులంతా సమానమే. అందులో నలుపు, తెలుపు అంటూ తేడా ఏం ఉండదు. జాతిని బట్టి మనుషులకి విలువ ఇవ్వకూడదని ఆయన అనేవారు.ఆయన ఎక్కువగా సైన్స్ ను అభిమానించారు. పరిశోధనలను ప్రోత్సహించారు. ఆయన స్ఫూర్తితో నేటి పాలకులు పిల్లల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి కృషి చేయాలి.
==================================
నవంబర్ 14 నెహ్రూ జయంతి సందర్భంగా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి