కవి ప్రజా ప్రతినిధి :- అంకాల సోమయ్య -దేవరుప్పుల - జనగామ- 9640748497
 కవి నవసమాజ నిర్మాత 
 చైతన్య స్ఫూర్తి ప్రదాత 

 కవి కలం నుండి జాలు వారే అక్షరాలు 
 సమాజోన్నతికి  పునాదిరాళ్ళు  

 కవిత్వం సామాజిక రుగ్మతల్ని మాన్పేది 

 కవి నవ కల్పన నూతన సమాజ
 నిర్మాణమై
 నూతన జగతికి శ్రీకారం చుడుతుంది.

 కవి వాగ్బాణాలు
 అన్యాయాలు, అక్రమాలపై
 సంధించినఅక్షరాస్త్రాలు 

కట్టు బానిసత్వాన్ని మట్టుబెట్టేవి
 హక్కులు కాలరాయబడ్డచోట నిరసన జెండై నిలిచేవి

 వేలెత్తి పిడికిలి బిగించి 
 పాలకుల లోపాల్ని ఎత్తిచూపేదికవిత్వం

 సామాజిక
 అసమానతలను రూపుమాపేవి
 కవిత్వమిప్పుడు రాజాశ్రయం  కాదు 

 కవిత్వమంటే  పేయిడ్ ఆర్టికల్ కాదు 
 కవిత్వమిప్పుడు ప్రజాపక్షం 
 కవిత్వం జన చైతన్యం 
 సర్వజనామోదము

, సకల జన సమ్మతం 
 కవి ప్రజలెన్నుకొనని 
 ప్రజాప్రతినిధి.
----------------------------------------


కామెంట్‌లు