నాయిన ప్రేమ
కోపంగా నీవంక చూడకుంటే
తప్పొప్పుల పట్టిక పరీక్షలో తప్పేవాడివి
బడిలో పాఠాలు
సంచి పుస్తకాల గింజల మొలకలు
గురువుల జ్ఞానసుధ పురివిప్పిన
ఊపిరి భావిభవతకు బంగారు వాకిలి
వంటింటి ఇంట్లో రుచికర వంట పొలాల ఆకుపచ్చ ఆకాశానిదే
శ్రమపడ్డ ఆమె చేతులు నడిచిన
దూరం జీవితమంతా
ఉడికే బువ్వ వేడిగా నోటి నాలుకను తడిమిన రుచి
కమ్మగా నింపే బోజ్జను పూటపూటకు
సూర్యున్ని ఆహ్వానించే అపరశక్తి అమ్మ
తన మెలుకువలోనే ఇల్లు నడిచేది
గడిచేది
ఆదివారం లేదు అలసటలేదు
క్షణం తీరికలేని చదువుశాల ఆమె
తొలి బోధనలు సరిచేసే నన్ను
రేకులు తొడిగే సాహిత్యం నాలో
రెక్కలు విప్పిన కిటికి రేపటి ఆశలకోసం
మూలాలే రోజూ ఓడ్చిన చెమటతైలం
ఊరట అది బాధల ఓదార్పు అల్లిన
బతుకున
మనసుమేధ ఎత్తిన జండా కవిత్వం!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి