మేమే బాలలం:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
బాలలం బాలలం
భానుని కిరణాలం
ముద్దబంతి పూవులం
మమతల కెరటాలం

దేవుని రూపాలం
గృహమున దీపాలం
అందాల బాలలం
మందార మాలలం

పున్నమి రోజుల్లో
వెన్నెలమ్న వెలుగులం
కన్నోళ్ల గుండెల్లో
ప్రేమలొలుకు చెలమలం

అందరికీ ఇష్టులం
స్నేహానికి గుర్తులం
వెన్నలాంటి మనసులం
కన్నవారి శ్వాసలం


కామెంట్‌లు