గుర్తుపెట్టుకోవాలి!:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
పేదల మీద దయతో
పిల్లలపై ప్రేమతో
ఉండాలోయ్! మానక
చూడాలోయ్! శ్రద్ధతో

కన్నవారి త్యాగాన్ని
వారి అనురాగాన్ని
గౌరవించాలి మహిలో
ధ్యానించాలి మదిలో

భగవంతుని నామాన్ని
అ దివ్య రూపాన్ని
తలచుకోవాలి సదా
అదే కడు ధన్యత కదా

గురుదేవుల పాదాల్ని
వారి గొప్ప బోధల్ని
భువిలో కొనియాడాలి
గుర్తుపెట్టుకోవాలి


కామెంట్‌లు