చిలుకమ్మ సూక్తులు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
పెద్దలను గౌరవించు
నీతిగా జీవించు
పదిమందికి సాయం
మనసారగ అందించు

మంచి దారి చూపించు
ప్రేమతో నడిపించు
అభివృద్ధి పథంలో
అలయక ఇల పయనించు

బ్రతుకులో సాధించు
అన్యాయం ఎదురించు
పేదోళ్ల పక్షాన
గిరిలా అవతరించు

కన్నోళ్లను ప్రేమించు
దేవుని ఆశ్రయించు
పొరపాట్లను క్షమించి
మిత్రులుగా భావించు


కామెంట్‌లు