కోయిల సందేశం:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
మనసుల్లో కత్తులు
మాటల్లో సూదులు
దాచుకున్న వ్యక్తులు
చూడగా కోకొల్లలు

నోటిలో తేలు విషము
కళ్ళల్లో కామము
నింపుకున్న నీచులు
కాటేసే త్రాచులు

గుండెల్లో  ద్వేషము
ఒళ్ళంతా గర్వము
ఉన్నవారు ఎక్కువ
మహనీయులు తక్కువ

పెద్దవారి సూక్తులు
వారు చేయు బోధలు
నేర్పునోయ్! పాఠాలు
దిద్దునోయ్! జీవితాలు


కామెంట్‌లు