తల్లిదండ్రులు పూజ్యులు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
తల్లిదండ్రుల మాటలు
వింటేనే దీవెనలు
వర్ధిల్లును జీవితాలు
సుఖమయం కుటుంబాలు

కళ్లేదుట కన్పించే
అమ్మానాన్నలు వేల్పులు
వారి మనసు నొప్పించే
చేయకూడదు ఏ పనులు

కన్నవారు త్యాగధనులు
గమనిస్తే స్ఫూర్తిదాతలు
కష్టబెట్ట కూడదోయి
వారి సున్నిత మనసులు

ఎన్ని జన్మలెత్తినా
తీర్చలేము వారి ఋణము
ఇది ముమ్మాటికీ నిజము
గుర్తించుకో అనుదినము


కామెంట్‌లు