శరణాగతి:- పి.ఆర్,లక్ష్మి

 దైవానుభూతికి దారిచూపే నిశ్శబ్దం
ఆత్మను శాంతిగా మార్చే పరిమళం
దైవనామమే దారిగా ఎంచుకున్న నా హృదయాన్ని
ఓ దేవా ,,నీకు నైవేద్యంగా
సమర్పణ చేస్తున్నాను తండ్రీ,
నీ చరణమే నాకు శరణాగతి
నేనొక ధూళి కణమయి నీ
పాదాల మీద పడి వున్నా
నా నయనాలు నిన్నే చూసేటట్టు చెయ్యు,
నా ఈ చేతులు నీ పూజ కోసమే ఉపయోగించనీ,
నా ఈ నోరు ఎల్లవేళలా నీ
నామమునే ఉచ్చరించనీ,
ఓ నీలకంఠ,
నీ నామమనే అమృతమును
నా నాలుకకు రుచిచూపించు
నీ స్మరణమే నిత్య ధారగా
నాలో స్రవించనీ,
నీ కరుణ వీక్షణం లేకుండా నీపై
నా ఈ మందబుద్ధి ఎలా నిలుస్తుంది ప్రభో!
నా ఆత్మ నీవే గదా ఓ దేవ దేవా
జీవితమనే కారడవిలో తపించు తున్నాను,
నా బలం నీ కృపయే అని
నిన్ను శరణు కోరుతున్నాను,
నా మనసు మేఘంలా కరిగి
కన్నీటి వర్షం కురిసే వేళ
ఆ వర్షములో తడిసి నేను తెలుసుకున్న సత్యం ఒక్కటే
కరుణాసింధో,
నీకు “శరణాగతి “పొందడమే
నా జీవిత పరమార్థమని.🙏🙏

కామెంట్‌లు