కురిసింది కోటివరాల కుంభవర్షం..!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.
ఓ శంకరా...శివశంకరా... 
ఓ భయంకరా...అభయంకరా...
ఓ ఈశ్వరా...పరమేశ్వరా...
ఓ జగదీశ్వరా...అర్ధనారీశ్వరా... 
మీ చిరు మందహాసాలే మాకు 
చిటపట చినుకుల చిరుదీవెనలు..!

మాపై 
ఆనందాలను...
సంతోషాలను... 
కరగని సుఖభోగాలను... 
తరగని సిరిసంపదలను... 
కలగనని సుఖశాంతులను... 
ఊహించని భోగభాగ్యాలను...

అష్టైశ్వర్యాలను... 
ఆయురారోగ్యాలను...
దివ్యమైన తేజస్సును...
దీర్ఘాయుష్షును ఏకం చేసి...
 
కురిపించండి తండ్రీ...
మాపై వేయివరాల కుంభవర్షాన్ని...
అందించండి‌...అర్థనారీశ్వరా...
మాకంతులేని ఆనందామృతాన్ని...

ప్రసాదించండి...పరమాత్మా...? 
మాకు చిత్త శాంతిని...
వేయి చంద్రుల వెన్నెల వెలుగుల్ని... 
కోటి సూర్య ప్రభల దివ్య కాంతిని...
నిండూ నూరేళ్ల ప్రశాంతమైన జీవితాన్ని...




కామెంట్‌లు