శ్లో కం :
స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః ।
స సర్వసౌభాగ్యఫలాని
భుంక్తే శతాయురాంతే శివలోకమేతి ॥ 13
పదార్థ వివరణ
స్తోత్రం – ఈ స్తోత్రాన్ని
త్రిసంధ్యం – రోజుకు మూడుసార్లు (ఉషఃకాలం, మధ్యాహ్నం, సాయంత్రం)
శివపార్వతీభ్యాం – శివపార్వతీ దేవతారువులకు అర్పిస్తూ
భక్త్యా పఠేత్ – భక్తితో చదివే
ద్వాదశకమ్ – ఈ పన్నెండు శ్లోకాల సమాహారాన్ని
నరః యః – ఏ వ్యక్తి చదివితే
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే – అతడు అన్ని శుభఫలాలను, ఐశ్వర్యాలను అనుభవిస్తాడు
శతాయుః అంతే – శతాయుష్యాన్ని భోగించి చివర
శివలోకమ్ ఏతి – శివలోకాన్ని చేరుకుంటాడు
తెలుగు భావం
రోజుకు మూడుసార్లు (ఉషస్సు, మధ్యాహ్నం, సాయంత్రం)
శివపార్వతీ దేవతారువులకు భక్తితో
ఈ పన్నెండు శ్లోకాల స్తోత్రాన్ని చదివే వాడెవడో,
అతనికి అన్ని సౌభాగ్యఫలాలు కలుగుతాయి.
దీర్ఘాయుష్యాన్ని పొందిన తర్వాత
తుదకు శివలోకానికి చేరుకుంటాడు.
******
శంకరాచార్య విరచిత - ఉమా మహేశ్వర స్త్రోత్రం :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి