****
"అబ్బబ్బా! అవ్వా! ఏం ముచ్చటి ఏం ముచ్చటిలే?వస దాగిన పిట్టోలే చెనం సుత నోరాగదన్కో.కతలు కతలుగ గా గుడ్డ ముక్కల్ని వన్నిత్తుంటే ఎవ్వలైన ఇంగ కొనకుండ వుట్టి సేతుల్తో పోరు తెల్సా అవ్వా!"
గా చిట్టెమ్మొదినె ముచ్చటేనా శెల్లె!గా వొదినె యిసయం నాకెందుకు తెల్వదు. తనే మిల్లులోంచి తాను తీసినట్టు,మొగ్గంల శీరె తానే నేసినట్టు కళ్ళకి కట్టిత్తది. ఒక్క పెశ్న అడగడం పాపం వొందకి తక్వ గాకుండ జవాబ్లు సెప్పుద్ది. మరి వాళ్ళాయన బట్టల కొట్లె బేరం బాగా సాగేదెట్లనుకున్నవ్. వొదినె మాటల శెలాకితనంతోనేనే శెల్లె "
"అవునా అవ్వా!ఫలాన పుల్లమ్మక్క అట్ల,ఫలాన ఎల్లమ్మొదినె గిట్ల అన్కుంట అడుగకున్న తీరిగ్గా ఊల్లె ముచ్చట్లు సెప్తుంటె ఎవలు మాత్తరం ఇనరు సెప్పు. రైక గుడ్డకో,సైను బట్టకో ఎల్తనా! టూలు పీటేసి కూసబెట్టి షురూ చేత్తది.ఇంట్లె వొదిలేసొచ్చిన పని యాది కొచ్చి లేవబోతనా! రెక్కబట్టి గీ ఒక్క ముచ్చటినిపో! అంటది.మామ్మ గని ఇంగ సాలొదినా! అన్న సుత ఆగదవ్వా!"
"అవునే శెల్లే! గిస్మంటోళ్ళను "అడక్కుండ జోలి జెప్పె అవుసుల రామక్క"తో పోలుత్తరు.
"ఏందవ్వా! బలే సిత్రంగుందే గీ సామెత!"
"అవునే శెల్లె! ఎన్కటికి అవుసులోల్ల ఇండ్లల్ల మొగోల్లు కుంపట్లె మూస బెట్టి బంగారం కరుక్కుంటనో,నగలకి రాళ్ళు పొతికిచ్చుకుంటనో, ఏదో ఒక పన్జేసుకుంట ఉండేటోళ్ళు.ఇంగ ఆడోళ్ళు సుత ఉత్తగ్గూసోకుంట కమ్మెచ్చు మీద సాగదీసిచ్చిన బంగారు తీగెతో నాన్తాల్లు( పుస్తెల తాళ్ళు)అల్లేటోళ్ళు.
"గస్మంటి సైమంలో ఓ ఆచారింటికి ఎవలో ఒకలు వత్తా వుంటే గాయన బార్య ఉత్తగుండకుండ తన పన్జేసుకుంటనే వొచ్చిన అమ్మలక్కల్తో సెప్పిన ముచ్చటి సెప్పకుండ తీరు తీర్గ జెప్పేదట.గట్ల గామె పేర్తో మన ఎన్కటోళ్ళు"అడుగని జోలి జెప్పె అవుసుల రామక్క" అని ఓ సామెతే పుట్టించిండ్రు శెల్లె.
"అవ్వోవ్! మన ఎన్కటోళ్ళ ముచ్చట్లు మామూలుగ లెవ్వు పో. గిట్ల కులాల తీర్గ సుత సామెతలు బుట్టించిండ్రు. వొళ్ళంత కళ్ళుజేస్కొని గియన్ని కనిపెట్టిండ్రట్టుంది గదవ్వా?"
"అవునే శెల్లె! గీ సామెతలన్ని గిట్ల గమనిచ్చుడుతోటి,అన్భవాల్నించి పుట్టినయే!"
గదంత అక్కన్నే ఉన్న భూలచ్మి ఇన్కుంట "అవ్వా! అవ్వా! ఇయ్యాల మా బల్లె! ఏం జర్గిందో తెల్సునా?" అంటుంటే...
"ఇగ్గో! శెల్లె సూడు "అడుగని జోలి జెప్పె సద్వుల భూలచ్మక్క" నోరు దెర్సింది. ఇంగ సాలే భూలచ్మీ! మా అవ్వగని ఆపే తల్లీ!కాల్మొక్త! అన్న సుత ఆపదు " అంటుంటే...
"ఏందవ్వా గట్లంటవ్! ఇంగ ఆపుత తీ" అని బుంగమూతి పెట్టింది భూలచ్మి.
గదండీ సంగతి! "అడగని జోలి జెప్పె-అవుసుల రామక్క" అంటే గిదే మరి. అడగకుండనె అన్ని ముచ్చెట్లు తీరిగ్గా కుండల కొద్ది గుమ్మరించేటోళ్ళను గిట్లంటరన్న మాట.
(ఈ సామెత పాకాల యశోదా రెడ్డి గారు "మా ఊరి ముచ్చట్లు" కథల సంపుటిలో ఉపయోగించారు)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి