మార్పు ఎక్కడ నుండి రావాలి:- కవి మిత్ర సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -హైదరాబాద్

 మార్పన్నది ప్రకృతి సహజం
బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం మార్పులే
మంచిని స్వీకరించి  చెడును వదలాలి
అసలు మార్పు నీతోనే మొదలవ్వాలన్నారు రమణ మహర్షి
నీ వెవ్వరని తెలుసుకు తరువాత ఇతరులగురించి చర్చించు
స్వార్ధం, అసూయలు వినాశనానికి కారణమని చెప్పడం కాదు
నీవు ఎంతవరకు స్వచ్ఛత ,అనురాగ ఆప్యాయతలను చూపుతున్నావని ప్రశ్నించుకో
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడక
నీవే మూఢనమ్మకాలకు అసాంఘిక సంఘటనలను ఎదురించు
మంచి మార్పుకై పోరాటంలో
అవరోధాలు ఎదురైనా భయపడకు
అందుకే మార్పన్నది మనలోంచే  రావాలి
అది సమాజాహితం కావాలి.......!!
...........................

కామెంట్‌లు