సామెత -35:-అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు
*****
"అవ్వా! ఒక్కపాలి మా చిన్నక్క ఇంటికి పోదం.నువ్వొత్తెనే గని గక్కడ పంచాతి తేలదు.
శెల్లే!ఏమైంది.గట్ల పరేషాన్ గున్నవు?
మా యక్కనే అవ్వా! ఎడ్డిమొగంది. దాన్కి ముందుగాల్నె జెప్పిన. ఎవుల్ని బడితే గాల్లని నమ్మొద్దె.ఒంటరి పచ్చివి.నీ సొమ్ముల కాశపడే వత్తర్గని నీకేదో సాయంచేత్తరు అన్కకోకంటె ఇన్నదా? గిప్పుడు నెత్తిమీద బర్వు దించెటోళ్ళు లేరని లబలబలాడుతుంది. దాని ఏడ్పు సూడలేకె సర్ర సర్ర నీ తానకి వొచ్చిన.
"గింత పొద్దుగాల పనేల వత్తె ఎట్లనే శెల్లె.జర్ర సైసు. గీ పన్లు గానీయ్"
"ఎంతెల్లెం వత్తె గంతమంచిదవ్వా!గాడిప్పటికే కొంప సత్తెనాసు జేసిండు.ఎవనెవన్నో పిల్సుకచ్చుడు. ఇల్లంత దోసిపెట్టుడు.దాన దర్మాలు జేసుడు."గిదేంది అనకుండ జేస్కుంది .గిప్పుడు లబ్బ దిబ్బోమని మొత్తుకుంటేమొత్తది.
"శెల్లే! గింతకీ గాడెవడో వుండేనేమె. అస్సలు మతికిరాట్లె.
గాడా అవ్వా! "అమ్మ సుట్టం గాదు అయ్య సుట్టం గాదు జంగమోన్ని పట్కొని జామేడ్సె" అన్నట్టుంది మా అక్క సంగతి."మా సిన్నమ్మమ్మ యారాలి కొడుకు శెల్లె కొడుకు.గాడే ఇసుంట రమ్మంటె ఇల్లంత నాదన్నట్టు జేత్తుండటవ్వా!
" మీ యక్క వరసకి అత్త అయితది గద. గట్ల "అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు" అంటే గిదేనే మరి. సరె ఎల్దాం పా."
"సత్తెం జెప్పినవ్ అవ్వా! గట్లనే ఉంది యవ్వారం. అగ్గో జూసినవ్ గద మా అక్కని.మంచాల నెత్తిన కొంగేస్కుని కూసున్నది."
ఇంటికి మగదిక్కు లేడని మాట మంచితనం నచ్చి గాడిని పట్కత్తె ఏకు మేకయ్యిండవ్వా . అత్తా! అత్తా! అన్కుంటనే ఆస్తంత గిట్ల ఆగమాగం జేత్తున్నడు.
నా సొమ్ము మీద గాడెందుకు పెత్తనం జెయ్యాలె.గదంత తేల్సుకునేందుకే నిన్ను తోల్కరమ్మన్నవ్వా!"
నువ్విచ్చిన అల్సేనే శెల్లె. "మంచిని వందిచ్చి కొనుక్కోవాలె-శెడుని వెయ్యిచ్చి ఒదిలిచ్చుకోవాలంటరు. గాడ్ని రేపు పొద్దుగాల పెద్దమడుసుల్ల బెట్టి పదో పరకో ఇచ్చి ఎల్లగొట్టు. ఇంటి గుట్టు మట్లేం పురాగ సెప్పలేదు గద! బయం బెట్టుకోకు మేమున్నం తీ." దైర్నం జెప్పింది అవ్వ.
గదండీ! సంగతి! "అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు" అంటే గిదే మరి. గట్లాంటోళ్ళను చేరదీస్తే ఇట్లనే ఉంటది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి