@ ఇగో ను పెంచి...! :- కోరాడ నరసింహా రావు.
 విద్య విజ్ఞానంతో పాటు వివేకాన్ని పెంపొందించా

లి కదా....! 
   అహంకారాన్ని పెంచి... అవి వేకులుగా తయారు చేస్తోందేమిటి...!! 
  
ఇగోను పెంచి మానవ త్వాన్ని త్రుంచే స్తుంది ! 

దా0పత్య మంటే , పరస్పర ప్రేమాభిమానాలు కదా... 
   ఈ చిరాకులు , చీత్కారా లేమిటి...!? 

నువ్వెంత అంటె నువ్వెంత అనుకుంటూ... ఈ అహం కారా లేమిటి ...?! 

ఓ హో.... ఇద్దరూ సంపా దిస్తున్నారన్న మాట...! 

ఈ డబ్బెంత పాపిష్టిది...! 
 అప్పుడు మగవాడిని పశువును చేసింది... ! 
  ఇప్పుడు  ఆడదాన్ని కూ డా పశువును చేసేసింది...!! 
  ప్రేమాభి మానాలను,గౌరవమర్యా దలనూ ... 
  మంట గలిపేసింది...! 
 
స్నేహ బంధాలను,రక్త సంబంధాలను సైతం త్రె0 చిపారేసింది...!! 

ఆహా...!  ధనమా...!! 
 మనిషి తన అవసరాలకు
నిన్ను శ్రుష్ఠిస్తే.. 
 నువ్వు ఈ మనిషి మీదకే ఎక్కి స్వారీ చేస్తున్నావా..!! 
     *******

కామెంట్‌లు