ఓ నా ప్రియ మిత్రులారా..!
ఈ శుభకర శుభోదయవేళలో
నా హృదయాంతరాలలో
విరిసిన ఈ సుందర సందేశాల
సుమమాల మీకే అంకితం..!
మిత్రులారా...!
నవ్వండి..!నవ్వండి..!
నవ్వుతూ జీవించండి..!
ఎందుకంటే..?
నవ్వు అంటే నవజీవనం...అది
గుండెలో పూసే మల్లెపూల పరిమళం..!
మీ మనసులో
నవ్వుల తోటలు పెంచండి..!
నలుగురి హృదయాలలో
ఆ పరిమళాలను పంచండి..!
ఎందుకంటే..?
చిరునవ్వు ఒక వెలుగు కిరణం...
అది చీకటినీ కరిగించే సూర్యరేఖ..!
చిరునవ్వు ముఖానికి ఓ ఆభరణం...
అది మదిని మురిపించే మందారం..
లేత పెదవులపై పూసే చిరుదరహాసం...
దుఃఖాలను దూరం చేసే మంత్రదండం..!
చిరునవ్వుతో చేసే నమస్కారం
సంస్కారానికి ఓ గొప్పచిరునామా..!
కావాలి చిరునవ్వే మన జీవన గీతం..!
అందుకే ఓ మిత్రులారా..!
నవ్వండి...నవ్వండి...నవ్వండి..!
నవ్వితే పోయేదేముంది చెప్పండి..?
చింతల మబ్బులు చెదరడం తప్ప...
ఆయుష్షుదీపం నిత్యం వెలగడం తప్ప..!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి