'బాలబంధు శ్రీ సమతారావు' అవార్డుకు గద్వాల సోమన్న ఎంపిక

 నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా  పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్నను  'బాలబంధు శ్రీ సమతారావు' అవార్డు వరించింది.శాఖా గ్రంథాలయం,అలపాటి కళావతి రవీంద్ర పీఠం మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ తెనాలి వారు  బాలసాహిత్యంలో కవి సోమన్న విశేష కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 20వ తేదిన ఈ అవార్డు గద్వాల సోమన్న అందుకోనున్నారని ఈ సంస్థ అధ్యక్షులు సహజ కవి డా.అయినాల మల్లేశ్వరరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.
కామెంట్‌లు