చలనచిత్ర ప్రారంభోత్సవానికి ఆహ్వానం
 పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించనున్న చలనచిత్ర ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరుతూ చిత్ర బృందం శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి , మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ జూపూడి ప్రభాకర రావు గారిని శనివారం హైదరాబాదులో కలిసి ఆహ్వానించారు. చిత్ర దర్శకుడు వేముగంటి, ఖమ్మం కు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ జూపూడి గారిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో రూపొందునున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ వేడుక ఈనెల 21న బల్లేపల్లిలోని నేచర్ ర్యాలీలో జరుగుతుందని తెలిపారు. వనజీవి రామయ్య జీవిత చరిత్రను భావితరాలకు స్ఫూర్తి నింపేలా చలనచిత్రం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు జూపూడి ప్రభాకర రావు తెలిపారు.


కామెంట్‌లు