'పిల్లలతో మమేకమై బోధించాలి': -జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి డా. పిఎం షేక్

 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్ స్ట్రక్టర్లు పిల్లలతో మమేకమై బోధించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్ అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలం గొర్రెపల్లి ఆదర్శ పాఠశాలలో జరిగిన ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్స్ట్రక్టర్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా పిఎం షేక్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్లు పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో కృత్యాధార బోధనను అందించాలన్నారు. ఇన్స్ట్రక్టర్లు అంకితభావంతో పనిచేసే అద్భుత ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. పూర్వ ప్రాథమిక విద్యలో పిల్లలతో ప్రేమపూర్వక పలకరింపుతో ఆనందకరమైన పరిస్థితుల్లో విద్యను అందించాలని, దానివల్ల పిల్లలు చక్కగా నేర్చుకుంటారని ఆయన అన్నారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గర్రెపల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోల్డీ బల్బీర్ కౌర్ మాట్లాడుతూ పిల్లలకు ఆటపాటలు, కృత్యాల ఆధారంగా వివిధ అంశాలను నేర్పించాలని, ఫలితంగా వారు నేర్చుకున్న అంశాలు చిలకాలం గుర్తుండిపోతాయన్నారు.  ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు అనుక్షణం పిల్లల్ని, వారు చేస్తున్న పనులను గమనిస్తూ ఉండాలని, వారి స్థాయికి అనుగుణంగా వివిధ బోధన అభ్యసన ప్రక్రియలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ డాక్టర్ పీఎం షేక్, ప్రిన్సిపల్ డాక్టర్ గోల్డీ బల్బీర్ కౌర్, జిల్లా రిసోర్స్ పర్సన్లు ఆర్. కిరణ్ కుమార్, ఎన్. రవి, ఈర్ల సమ్మయ్య, కె. కృష్ణారెడ్డి, జి. రమేష్, ఉపాధ్యాయుడు లచ్చన్నలతో పాటు జిల్లాలోని వివిధ మండలాల పూర్వ ప్రాథమిక విద్య బోధకులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు