ఏమిటీ మరణ మృదంగం:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.

 చదువుకుంటే సంస్కారం వస్తుందని
శాస్త్ర సాంకేతికతతో అభివృద్ధి సాధించవచ్చని
'వైద్యో నారాయణో హరి:'అన్నదానిని మరచి
ప్రాణం పోయవలసిన వైద్యులే
దేశ రాజధాని ఢిల్లీ మహానగరం లో
ప్రసిద్ధ చారిత్రాత్మక నిర్మాణం
ఎర్రకోట సమీపంలో కారు బాంబు దాడి జరిపి
సాధారణ ప్రజల మరణానికి కారణమై
వారి కుటుంబ సభ్యుల కడుపుకోతకు,
జీవితాంతం మానసిక వ్యథకు బాధ్యులై
వైద్యవృత్తికే కళంకం తెచ్చి
ఉగ్రవాద చర్యలకు పాల్పడి
మరణమృదంగానికి కారణభూతులైన
వారిని సూటిగా ప్రశ్నిస్తున్నా
ఇదేనా వైద్య వృత్తిలో మీరు చేసిన ప్రతిన
ప్రాణం పోసెమీరే ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం
మానవత్వాన్ని మంటగలిపే మీరు ప్రాణదాతలా
ప్రాణవిధ్వంసంకులా
ఏమిటీ మరణ మృదంగం?.
...............................

కామెంట్‌లు