ఏది విధి లిఖితం..? : - కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.
ఈ మానవ జీవితంలో...
లాభనష్టాలు...సుఖదుఃఖాలు...
మంచి చెడులు...పాప పుణ్యాలు...
చీకటి వెలుగులు...జనన మరణాలు...
గెలుపు ఓటములు...విధి లిఖితాలు...
పరమాత్మ శాసనాలు...ప్రకృతి ధర్మాలు...

మన నెత్తిన పూలవర్షం ...
రాళ్లవానలు కురిసినా...పర్వాలేదు...
కానీ...పిడుగులు పడితేనే ప్రమాదం... 

కాలిలో ముళ్లు గుచ్చుకుంటే పర్వాలేదు...
కానీ... కంటిలో ముళ్ళు గుచ్చుకుంటేనే
లోకం చీకటయ్యేది..!

ఒక దెబ్బ తగిలితే ఓర్చుకుంటాం...
కానీ... వెయ్యి సుత్తి దెబ్బలు తగిలితేనే
మనిషి గుండె గాజులా ముక్కలయ్యేది..!

ఏ గుంటలో పడినా... 
ఏ చెరువులో మునిగినా...పైకి రావొచ్చు 
కానీ... ఊబిలో పడితేనే ప్రమాదం..!
రక్షించరారెవ్వరు....రక్షించలేరెవ్వరు..?

పొలంలో పంట చేతికొచ్చే వేళ...
ఏచీడ పీడ పట్టినా మందుంది..
కానీ... పంట వరదల్లో కొట్టుకుపోతేనే...
కడుపు కోత...కావొచ్చు అది విధివ్రాత...!

చిన్నజబ్బు చేస్తే మందులున్నాయి
కానీ... గుండె ఆపరేషనంటేనే
గుండెల్లో గుబులు రేగుతుంది 
భారీ ఖర్చులు భరించినా విధి వికటిస్తే..?

కారు, బస్, విమాన ప్రమాదాల్లో
అదృష్టవశాత్తు బ్రతికి బట్ట కడితే 
మిగులు...గాయాల జ్ఞాపకాలు... 
కానీ...అగ్నిజ్వాలల్లో ఆహుతైతే
మిగిలేది బూడిదే ఆప్తులకు గుండెకోతే..!

యుక్త వయసులో 
ప్రియురాలు మోసం చేస్తే భరించవచ్చు
కాలం ఆ నొప్పిని నయం చేస్తుంది...
కానీ...మూడు ముళ్ళ తర్వాత...ప్రేమ తరిగితే...
ద్రోహం జరిగితే...తాళి తెగితే...
ఆ ఆవేదన ఆత్మను ముక్కలుచేస్తుంది...
గుండెల్ని పిండేస్తుంది...
మనసు విరిగిపోతుంది...
పరువు బరువైతుంది...
గౌరవం గంగపాలౌతుంది...

ఏది విధి లిఖితం..?
ఏది మన పాప ఫలితం..?
ఎవరికి తెలుసు?ఆ పరమాత్మకు తప్ప 



కామెంట్‌లు