సామెత -57: అవ్వా కావాలి- బువ్వా కావాలి
*****
"అవ్వా!గా కోటమ్మ ముచ్చటిన్నవా? గా పెండ్లిండ్ల పేరయ్య తెచ్చిన పతి సంబందం ఎల్లి జూసొచ్చుడు.కాలొంకని,ఏలొంకని,నల్లగుంటె మశిగుడ్డ లెక్కుందని,ఎర్రగుంటె ఎర్ర తేలని,సద్వుంటె సక్కదనం లేదని,సక్కదనముంటె ఇవురమున్న పిల్లొతికె అనిపిస్తలేదని...గిట్ల ఎల్లిన సోట్కల్ల ముగ్గురు నల్గుర్ని సుట్టపోల్లను తోల్కపోవుడు వొంకల మీద వొంకలు బెట్టుడు" గిదేమన్న మంచిగుంద?నువ్వే జెప్పు. ఏం మడుసులో ఏందో? మొగ పిల్లగాడి తరపోల్లమని గంత యిరగబాటా?
"ఎవరక్కా?గంతగనం యిర్గబడేది? బడే బాద్దరిది?"
"గదేనవ్వా! కోటమ్మ ముచ్చటి యిన్లేదా? కొడుక్కి పెండ్లి సంబందాలు సూత్తుంది గద!గాడేమన్న అందాల సందరాంగుడా? ఓ మోత్తరుగుంటడు గంతే. సర్కారి ఉజ్జోగం జేత్తుండంటది.గదెట్లొచ్చిందో అందర్కి తెల్సు. ఒక్కగా నొక్క పోరడు. సదువు అంతంత మాత్తరమని తెల్విగ మొగుడు ముందుగాల దిగి గాడికి వొచ్చెటట్టు జేసిండు".
"అయితే మాత్తరం? ఆడపిల్లోల్ల ఇండ్లకు బోవుడేంది.గట్ల కుతికెల దనుక పలారాలు మెక్కొచ్చుడేంది?"
"గంతే గాదవ్వా! గా పోరడికి పిల్ల ఏబీసీడీయీల లెక్క ఉండాలంట?"
గీ మాటేందో గమ్మత్తుంది ఇంగిలీసు అచ్చరాల్ల పొల్ల ఉండటమేందే? నాకైతే శిత్రంగనిపిత్తుంది?"
"గవంటేందో ఎవలికన్న చెప్పనీకి రాసియ్యమంటే పొల్లగాడే సొయంగ రాసిచ్చిండు.ఇగ్గో గీ కాయితంల ఉంది."
"అవ్వా! అవ్వా!గవేందో నేను జదువనా?" అక్కడే కూసోని సద్వుకుంటున్న భూలచ్మి ఎగిరి గంతేసి దాన్ని అందుకుంది.
"ఏ అంటే యాకిటివ్వు. బి అంటే బూటీ. సి అంటే క్లెవరు, డి అంటే డౌరీ. ఈ అంటే ఎడుకేషన్ అని సదివి వాటి అర్థాలు సెబుతుంటే అవ్వ, చిలుకమ్మ ముక్కునేలేస్కుని ఇద్దరు ఒక్కపాలే ''ఓషి నీ అసాద్దెం కూల" అన్కున్నరు".
అవ్వా!పైంగ పెల్లయినంక పిల్లట తమ సెప్పుసేతుల్లో అటుద్దోగం ఇటు ఇంట్లెపని నోరెత్తకుండ సేస్కోవాలంట."
"అవ్వ కావాలి -బువ్వా కావాలి" అంటే గిదే మరి.అట్లెట్ల సాద్దెమయితది. అందుకే మన పెద్దోళ్ళు గిస్మంటోళ్ళను జూసే గట్లాంటి సామెతలు పుట్టిస్తరు."
అంటున్న అవ్వ మాటలిని. "గట్ల జేత్తె ఎవలు పిల్లనియ్యడాన్కి ముందుకి రారు. ఇంగ గాడు ముదిరిన బెండకాయ లెక్క ముదిరి పోవుడు కాయం తీ. అంటుంటే ..."
అంటేందని భూలచ్మి , బుడ్డోడు ఒక్క తీర్గ అడ్గ బట్టిండ్రు. మీ లెక్కనేరా "సద్వు గావాలె అంటరు బడికి సెలవు గావాలంటరు" బడి లేకపోతే సద్వెట్ల అబ్బుంది చెప్పుండ్రి" అంటుంటే..
"అవ్వా! మేం గసంటోల్లం గాదు! గార్వాలు బోతూ మాకు "నువ్వు గావాలె బువ్వ గావాలె" అన్న మాటల్కి.."
"ఓ అవ్వోవ్! నీ మన్వడు,మన్వరాలు సామాన్యులు గాదే" అంటుంటే...
అవ్వ వాళ్ళని దెగ్గర్కి తీస్కొని మురిసిపోతూ ముద్దులు పెట్టింది.
గదండీ సంగతి! "అవ్వ కావాలి- బువ్వ కావాలి" అనడంలోనే ఎంత స్వార్థం ఉందో అర్థం చేసుకోవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి