చెల్లని పైసలం మనం
గాలిపటాలం మనం
భోగం ఆటలం మనం
గాల్లో కలిసిపోయే ప్రాణాలం మనం!!?
పని పాట లేని మాటలం మనం
దిక్కు మొక్కులేని మొక్కులం మనం
వీధుల వెంట కాలే కాగడాలం మనం
మనుషుల వెంట తిరిగే నీడలం మనం
నిప్పును ఆర్పే నీరు మనం
చెప్పుడు మాటలు వినే
నిప్పుపై ఉప్పు రవ్వలం మనం
కోపం కొప్పులో నవ్వులాటలం మనం
మద్దెలలా బాధితులం మనం
గద్దెల గాధలం మనం
ఎవరూ లేని అనాధలం మనం
బలం బలగం లేని మూగజీవులం మనం!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి