ఎవరో వస్తారని ఏదోచేస్తారని కూర్చోక శాంతి అహింసలే సాధనాలుగా ముందడుగు వేసి స్వాతంత్య్ర సముపార్జన చేసిన మహాత్మాగాంధీ నేటికి చిరస్మరణీయులు.
పేపర్ బాయ్ గా పనిచేసినా ముందడుగు వేసి క్షిపణి రూపకర్తగా, శాస్త్రవేత్తగా, దేశ అత్యున్నత పదవి దేశాధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన భారతరత్న అబ్దుల్ కలామ్ వసుదైక కుటుంబానికే ఆదర్శం.
మహిళలు అన్నిరంగాలలో పురుషులతో సమానమే అని నిరూపించిన మొదటి మహిళా పోలీస్ అధికారిణి కిరణ్ బేడి, ముందడుగు వేసి శాస్త్ర, సాంకేతిక రంగాలలో పోటీపడి రోదసి లోకి ప్రవేశించిన కల్పనాచావ్లా, ప్రార్ధించే పెదవుల కన్నా, సహాయం చేసే చేతులు మిన్న ప్రేమమయి మథర్ థెరిస్సా
ఇన్ఫోసిస్ వ్యవస్తాపకురాలు సుధామూర్తి ఎందరో. మహిళ మూర్తులు దేశాభివృద్ధికి తోడ్పడున్నారు.
మతం కాదు మానవత్వమే ముఖ్యం అన్న మహాకవి
శ్రీ శ్రీ పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పై కి అని తన రచనల ద్వారా ,సారే జహా సే అచ్చా, హిందు సితా హమారా అని ఎలుగెత్తి చాటిన కవి ఇక్బాల్ వంటి వారిని ప్రేరణ గా తీసుకుని ముందడుగు వేసి సమ సమాజ నిర్మాణ స్థాపన చేద్దాం. వసుదైక కుటుంబానికే ఆదర్శంగా నిలుద్దాం.....!!
................................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి