తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు శాంతా-వసంతా ట్రస్ట్ వారి సౌజన్యంతో శ్రీమతి కోడూరి శాంతమ్మ స్మారక బాలల సాంస్కృతి కోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో భాగంగా "పద్యకవిత "విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగుట , తొగుట మండలం సిద్దిపేట జిల్లా పాఠశాల విద్యార్థి రంగనమైన విష్ణువర్ధన్, 10 వ తరగతి ప్రథమ స్థానంలో విజేతగా నిలిచి నగదు బహుమతి 2000 /-రూపాయలు, మెమొంటో సర్టిఫికెట్ తో ఘనంగా సన్మానించారు, అలాగే వచన "కవిత " విభాగంలో 7వ తరగతి నుండి S.అవంతి ప్రోత్సాహ నగదు బహుమతి 500/- అందుకోవడం జరిగింది . అందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు A ఉపేందర్ గారు , మరియు పాఠశాల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు విజేతలైన విద్యార్థులకు మరియు తెలుగు భాష ఉపాధ్యాయులు A. శ్రీమతి నాగలక్ష్మి, మచ్చ అనురాధ గారలను ప్రోత్సహిస్తూ అభినందనలు తెలియజేశారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగుట విద్యార్థులకు బహుమతులు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి