మర్చిపోవటం అంటే
మరణించటం కాదు
మరో లోకంలో ఉండటం!!
తిరిగి మన లోకంలోకి
మనం రావచ్చు
మరొకరి లోకంలోకి మారవచ్చు!!
మర్చిపోవడం అంటే మరణించటం కాదు
మనం ఉన్నా లేకున్నా ఉండటం!!!
మర్చిపోవడం అంటే అలవాట్లు కోరికలు
ఆశయాలు ఆశలు
లేకపోవటం కాదు మర్చిపోవటం
మనకు తెలియకుండానే మనం మర్చిపోవటం
మనకు తెలియకుండానే మనం మారిపోవటం
మర్చిపోవడం అంటే
నిద్రపోవటం మేల్కొనటం
నిద్రపోయినప్పుడు స్వప్నాలు
మేల్కొన్నప్పుడు ఆలోచనలు
ఉండకుండా ఉండడం కాదు
శరీరాన్ని మనసును
మనల్ని మనం మర్చిపోవటం
మర్చిపోవడం అంటే
మరణించటం కాదు!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి