అందెశ్రీ మృతికి ప్రగాఢ సంతాపం

 జయ జయహే తెలంగాణ జనని జయకేతనం గీత రచయిత అందే శ్రీ పరమపదించడం పట్ల తెలంగాణ వివేక రచయితల సంఘం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది . ఈ సందర్భంగా తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా. వాసరవేణి పర్శరాములు నవంబర్ 10 న మాట్లాడుతూ అందశ్రీ గారితో తనకు అనుబంధం ఉందని, ఒక ఆత్మీయుడిని కోల్పోయామని, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ గారు తనను సాహిత్య రచనల్లో ప్రధానంగా బాల సాహిత్య రచనలు చేయాలని ప్రోత్సహించారనీ, బాల సాహిత్యం రాయడం అతి కష్టమైన పని అని బాలసాహిత్యంలో ముందుకు సాగిపోవాలని అనేకసార్లు చెప్పారని తెలిపారు. 2024 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాజమండ్రిలో 3 రోజులు ఒకే గదిలో  ఉన్నామనీ, "నేను రాసిన" నారుమడి " పుస్తకం ఆవిష్కరణ చేసారనీ , అనేక  సభల్లో కలిసేవారిమనీ, సాహిత్యపరంగా ప్రోత్సాహం అందించారనీ, అదేవిధంగా అందెశ్రీ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తి గ్రామంలో 1961 లో జన్మించారని, బాల్యంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, పశువుల కాపరిగా , కార్మికుడిగా ,తాపీ మేస్త్రి గా పనిచేస్తారని సహజమైన కవిత్వం రచించారని, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, కొమ్మచెక్కితె బొమ్మరా, చూడా చక్కని లాంటి అనేక సామాజిక  పాటలను , "నిప్పులవాగు " పుస్తకం రచించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చేవరకు తన వంతు పోరాటం చేశారని అన్నారు. దాశరథి సాహితీ పురస్కారం , నంది పురస్కారం, సుద్దాల జానకి హనుమంతు పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అనేక పురస్కారాలు పొందారని, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందనీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ 2, 2025 రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా "జయజయహే తెలంగాణ" గీతాన్ని రాష్ట్ర గీతంగా పెట్టడంతో పాటు కోటి రూపాయల పురస్కారం అందజేశారనీ గర్వకారణం అన్నారు. అందెశ్రీ గారు పరమపదించడం, సాహితీ లోకానికి, తెలంగాణకు తీరని లోటని పర్శరాములు అన్నారు.
       సంతాపం తెలిపినవారిలో  తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు శివాల భక్తర్, జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్, సలహాదారులు డా.జనపాల శంకరయ్య, ఇమ్మడోజు మహేందర్, రచయితలు  ఫణి లక్ష్మణ్, వాసరవేణి దేవరాజు, బార ధనరాజ్,, గుండెల్లి నీలకంఠం తదితరులు సంతాపం తెలిపారు.
కామెంట్‌లు