కంచంలో…కమ్మని భోజనం వడ్డించిఎవరైనా కడుపు నింపితేఆకలి తీరిపోతుంది…అన్నదాతా సుఖీభవఅనాలనిపిస్తుంది...!మంచంలో…పరుపు మేఘంలామెత్తగా ఉంటే వాలిన మేనుమెల్లగా నిద్రలోకి జారిపోతుందిఆపై కనురెప్పల్లో కలల రాజ్యమే..!ప్రపంచంలో…ఒక మనిషీమరో మనిషిని ప్రేమిస్తే…మనిషి మనిషిలోమంచితనం దీప్తిగా వెలిగితే…!వినయం విధేయతవిజ్ఞాన కుసుమంలా వికసిస్తే...మనసులో మానవత్వంసంధ్యారాగంలా పరిమళిస్తే…!ప్రేమతత్వం నిశ్చల నిర్మలనదిలా నిరంతరం ప్రవహిస్తే…సహనం సౌభ్రాతృత్వంసూర్యోదయంలా ఉదయిస్తే…!సృష్టిలో ప్రతి జీవినీసమదృష్టితో చూస్తే…ప్రకృతిని తల్లిలా ఆరాధిస్తే…శాపాలకు బలికాకపంచభూతాల్ని శాంతింపజేస్తే…ఆత్మ పరమాత్మలోనిశ్శబ్ద దీక్షగా లీనమైతే…!అంతరంగమేదైనాఅది అమృతంకురిసిన రాత్రియే…అది ఒక అక్షయపాత్రే…జీవితమేదైనా అదిసుఖశాంతుల సూర్యోదయమే…!ఇక ప్రపంచం ఒక శాంతినిలయమే…!జీవితమంతా స్వర్ణ కాంతిమయమే..!
ప్రపంచం ఒక శాంతినివాసం…?- కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి