గొప్పేం లేదు!!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
మహర్షి అంటే ఎవరు!!?
ఋషి అంటే ఎవరు....!?
తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు!!.

మహర్షి అన్న రుషి అన్న మనిషే!
మరి మనిషి అంటే ఎవరు!!......!!?

మనిషి అంటే ఒక మెదడు 
మనిషి అంటే ఒక గుండెకాయ 
మనిషి అంటే ఒక మూత్రపిండం 
మనిషి అంటే ఒక కాలేయం....!

అవి తన పని అవి చేసుకుంటూ పోతాయి!!.
మనిషి అంటే ఒక యంత్రము 
మనిషి అంటే ఒక మంత్రం!!...!

సాధారణము అసాధారణము 
గొప్ప మహా గొప్ప 
మేధావి మహా మేధావి 
పండితుడు మహా పండితుడు 
అంటే....!?

తన పని తను చేసుకుంటూ వెళ్లేవాడు 
తప్ప 
దాంట్లో గొప్పేం లేదు!!!!!!?

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు