****
"అవ్వా! అవ్వా!భూషయ్య తాతింటి కాడ మస్తు లొల్లి లొల్లిగుంది.మాకు బయమై ఉర్రికొచ్చినం."
బుడ్డోడు భూలచ్మి గసబెట్టుకుంట చెప్తుంటే అవ్వకేం సమజవ్వలే. "అసలు గా తాత్తో మీకేం పని? గాడికెందుకు బోయిండ్రు? లొల్లి ఎందుకైంది జర్ర సమజైట్టు చెప్పే భూలచ్మీ!"
ఇంగో! ఇంగో! నేను అక్క,అక్క దోత్తులు బడ్నుండి వత్తుంటే అప్పుడప్పుడు గా తాత మమ్ముల్ని పిల్చి నపరింత బెల్లం ముక్క ఇత్తడు తెల్సా?
"గాయ్న ఉత్త పున్నేనికి మీకు బెల్లం ముక్కలెట్లిత్తడబ్బా? గంత మంచోడు ఎప్పుట్నుంచి అయ్యిండు? నిజం చెప్రా బుడ్డోడా? గా తాత ఉత్తగనే పేమగ పిల్సి మీకు బెల్లం తాయిలం బెడ్తుండా?.. గద్రాయించి అడిగింది.
నిజంగవ్వా! ఒట్టు. తాత ఉత్తగనే ఎప్పుడన్నొక్క పాలి పిలుత్తడు.లిచ్చెన ఎక్కిచ్చి అట్కమీదున్న డబ్బలు దీయిత్తడు.ఐపోయిన అట్టడబ్బలు తీసి బయట బడేపిత్తడు.
"ఓ అక్కా! నీ దోత్తులతో ఓ బురుషు ఇచ్చి పెద్ద పెద్ద కుర్సీల్ల దుమ్ములు దులిపిచ్చేది చెప్పవా!
అవునవ్వా! గిట్ల కొట్లె పనులు జెయ్యంగనె బెల్లం ముక్క చేతిల బెడ్తడు. ఏం పని జెయ్యకపొయినా తమ్ముడికి సుత బెల్లం ముక్క ఇత్తడు తెల్సా!
గాళ్ళ మాటల్కి అవ్వకి మస్తు కోపమొచ్చింది. పసోళ్ళతో అన్నెన్ని పన్లు జేయించుకుంట అర్చేతిల గింత బెల్లం ముక్క పెడ్తున్నమాట.
"అర్చేతిల బెల్లం బెట్టి మోచేయి దాకా నాకించినట్టు " అంటే గిదే. ఒరేయ్! గా బెల్లం ముక్కకి ఆశపడి గా పనులన్నీ జేసొత్తరా?బడవకానల్లార! గీసారైతె దెల్వాలి " ఇగ ఈపు ఇమానం మోతనె" మీకు ఏదంటె అదిజేసి బెడ్తున్నది జాలక గదొక్కటి తక్వైనాది.
మాకంటె ఎక్కువ మా దోత్తులే జేత్తుండ్రు దెల్సా! గియ్యన్ని అవ్వకి జెప్పకుండ్రి.జెప్పితె జల్మల యియ్యనన్నడు.
గా బెల్లం ముక్కేదో నన్నడిగితే బెట్టనార? ఇంట్లె గిటున్న శెంబు గటు బెట్టడం శాత గాద్గని.. అంటుంటే అప్పుడే లోపల్కి వస్తున్న ఇస్తారి ఇని...
ఓ అవ్వా! గాళ్ళంటే బుడ్డపోరలు. గింత బెల్లం కోసం బుడ్డ బుడ్డ సేతుల్తో పెద్ద పెద్ద పన్లు జేసిండ్రు. ఇంగ మా బజార్న నలుగురైదుగురు అమాయికపోల్లు ఉన్రు.గాళ్ళతో ఇల్లెడు పన్లు జేయించుకుంట ముక్కిపోయిన కందిపప్పు, పురుగులు బట్టిన శెనగలు,సయిమం అయిపోయిన సరుకులు బెట్టి "పైంగ నేను గాబట్టి గింతగనం బెడ్తున్న"అంటుండంట.గాళ్ళు వాట్ని వండ్కొని దిన్లేక, అసలు విషయం చెప్పలేక నా తానకొచ్చిండ్రు.
గా భూషయ్యకి గట్టిగ జెప్పుండ్రి అంటే గియ్యాల ఆల్లింటికి ఎల్లి లొల్లి బడ్తున్నరు.చాక్రీ చేయించుకున్న దానికి నాయం జేయాల్నా ? వద్దా? నువ్వే జెప్పు అవ్వా!
గా మాటల్కి అవ్వ "గా భూషయ్యకి మా బాగ టెంపర్ ఎక్కువైంది.అల్పం గిల్పం అంత ఎల్లాలె. లేకపోతే "అరచేతిల బెల్లం బెట్టి మోచేయి దాకా నాకించినట్టు" జేస్తడా!" కోపంగా అంటున్న అవ్వ మాటల్ని చెవులొగ్గి ఇన్కుంట...
" ఒరేయ్ బుడ్డోడా! గా తాత మనల్ని మోసం జేసిండు. ఇంగెప్పుడు గిస్మంటి పన్లు అస్సలు చెయ్యొద్దు" అనంగనే "ఔ మల్ల" అన్నాడు బుడ్డోడు."
గదండీ సంగతి! "అరచేతిల బెల్లం బెట్టి మోచేయి దాకా నాకించినట్టు" కష్టానికి తగిన విధంగా పెట్టకుండ , చిన్న వాటితో సరిపుచ్చి,మోసం చేసే వాళ్ళని ఉద్దేశించి ఈ సామెత చెప్పబడింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి