శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం
 ఓం వేదసారాయ నమః
ఓం యజ్ఞలక్ష్మ్యై నమః
ఓం క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై నమః
ఓం అన్నలక్ష్మ్యై నమః


శ్లోకం:
అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్థలం భర్తృగృహం మురారేః |
కారుణ్యతః కల్పయ పద్మవాసే 
లీలాగృహం మే హృదయారవిందమ్ || 23 ||

తా.:
అమ్మా, కంజదళాయతాక్షి దేవి! నీవు పుట్టిన ఇల్లు సముదృనిలో వున్న కమలము. నీ అత్తవారి ఇల్లు, సాక్షాత్తూ జగన్నాథుని హృదయ కమలమే. నీవు కరుణామూర్తివి కనుక, నిన్ను పూజించే నా మనసును కూడా కమలమే అని నీవు అనుకుని, నా మనసును నీ విలాస గృహము గా చేసుకుని నన్ను అనుగ్రహించు, భవతారిణి!!
భావము:
శన్కరభగవద్పాదులు ఈ శ్లోకం లో పరమేష్టి అయిన మహాలక్ష్మిని "నా ఇంటికి వచ్చి వుండు తల్లీ!!" అని అడగలేదు. "నా మనసునే నీ యిల్లుగా చేసుకుని వుండు" అని అడిగారు.
లక్ష్మీ దేవి "చంచలమైన స్వభావము కలది. ఏ ఒక్క చోట స్థిరంగా వుండదు" అని కదా! లోకంలో అందరూ అంటారు. ఆమె, ఇంటికి మాత్రమే వేస్తే, ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కానీ, ఆమె అపరిమితమైన కరుణకు రూపమైన అమ్మ కదా! ప్రేమను భక్తి తో కలిపి మనసులో కూర్చోబెట్టుకుంటే, ఎక్కడకు వెళ్ళదు. "భక్తవశంకరి" కదా. అందుకే శన్కరభగవద్పాదులు "నా మనసునే నీ ఇల్లు చేసుకో తల్లి" అని అడిగారు. మనల్ని అడగమంటున్నారు. అడిగేద్దాం. మనసులోనే వుంచేసుకుందాం, శాశ్వతంగా.
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు