తొందరెందుకు ?:- ఎ.పి.వేంకటరెడ్డి

సాహితీ కెరటాలు 
============= : 
పరిగెత్తే కాలంతో 
పరిగెత్తాలనే తొందరెందుకు?
నిదానమే ప్రధానమని 
ఆరాటపడితే ఆయాసమేనని
అనుభవజ్ఞులు ఆక్రోశిస్తున్నా..
అత్యుత్సాహమెందుకు ?

ఒకటికి పదిసార్లు...
ఆలోచించాకే అడుగేయాలని
చరిత్ర చెబుతున్న సత్యం.
తొందరపడ్డందుకేగా..
శిశుపాలుడు నాశనమైంది.
మిడిసిపడ్డందుకేగా..
దుర్యోధన,రావణాదులు
విలన్లుగా మిగిలిపోయింది.

ఆలోచన లేకుండా 
తీసుకునే నిర్ణయాలన్నీ
వికటిస్తాయన్నది జగద్విదితమే.
తొందరపాటు నిర్ణయాలు వదిలేస్తే 
సరియైన ఫలితాలు చేకూరుతాయి.
ఆలోచించి అడుగేద్దాం
అనుకున్నది సాధిద్ధాం.
కామెంట్‌లు