సుప్రభాత కవిత : - బృంద
కొమ్మల చేతులు కలిపి 
కోట ద్వారము చేసి
కొత్త వెలుగులకు గొప్పగా
కోరి జోతలు చేసే 
కోరిక ఎంత గొప్పది!

మేదిని ఒడిలో  జన్మించి 
మోదముతో ఎదిగి నిలిచి
మమతలన్నీ పంటగా
మానవాళికి కానుక ఇచ్చే
మొలక మనసెంత గొప్పది!

మదిలో నిండిన దైవమే 
ముంగిటిలో నిలువ చూసి
మనసే హారతి చేసి
మమతల మాలలు వేసి 
మురిసే చేని ప్రేమెంత గొప్పదో!

పసిడి రంగులు నింపి 
పచ్చగ నింగిని నిలిపి
పిలిచిన ప్రభువును కని
పలికే అంబర శోభల
ప్రకాశమెంత  చక్కనిది!

ప్రకృతిలో ప్రతి అణువు 
చక్కగ చైతన్యము పొంది 
కొంగొత్త కళలతో మెరిసే 
తొలి సంధ్యా సమయాన్ని
తిలకించే వరమెంత గొప్పది

మనమే మందిరముగ చేసి 
మానవత్వం పరిమళించగా
మాధవుని మనలో నిలిపే
మనకై వచ్చిన మరో వేకువకు 
మనస్ఫూర్తి గా ఆహ్వానిస్తూ...

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు