ఆలోచించండి:- కోరాడ నరసింహా రావు !

 వ్యసన పరు లైపోతే... 
ఎంత గొప్పవారైనా... 
    చిన్నవారి వద్ద కూడా తల దించుకోవలసిందే...! 
   వ్యసనాని కున్న నీచత్వ మేఅంత...! 
   దానితో పాటు, దాని నా స్రయించిన వారినీ అస
హ్యించుకునేట్టు చేసేస్తుంది
      మద్యపానం తనను, తనతో పాటు తన కుటుంబాన్నీ... 
  వీధిన పడేయటమే కాకుండా... 
  తనను అర్ధాంతర ఆకాల మరణం పాలు జేస్తుంది ! 
  మాన, మర్యాదలను మంట గలిపి... 
  వావి, వరుసలను గుర్తించ లేని కామా0ధులుగా దిగజార్చి
   అటు ధనాన్ని, ఇటు  ప్రాణాలనూ హరించే... 
   ఈ మద్యపానం అవసరమా....! 
     ఆలోచించండి.... 
 మిత్రులారా.... ఆలోచించండి.... ! 
      ******
కామెంట్‌లు