పుట్టింది!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
జీవం కన్నా ముందు 
విశ్వం పుట్టినట్లు 
గాయం పుట్టింది!!

ప్రేమ కన్నా ముందు 
ఆమె పుట్టినట్లు 
గుండె పుట్టింది!!!

మనసు కన్నా ముందు 
మనిషి పుట్టినట్లు 
జ్ఞాపకం పుట్టింది!!

ఆనందం కన్నా ముందు 
విషాదం పుట్టినట్లు 
నొప్పి పుట్టింది!!!

జంట కన్నా ముందు 
ఒంటరి పుట్టినట్లు 
వంధ్యత్వం పుట్టింది!!

ఆకలి కన్నా ముందు 
అన్నం పుట్టినట్లు 
అమ్మ పుట్టింది!!!

అమృతం కన్నా ముందు 
విషం పుట్టినట్లు 
అమరం పుట్టింది!!!

అతనికన్న ముందు 
ఆమె పుట్టినట్లు 
జనన మరణం పుట్టింది.!!

చిట్టి తల్లి లావణ్య కు ప్రేమతో. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు