ధర్మేంద్ర : - కవిమిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-హైదరాబాద్.

బాలీవుడ్ కే వన్నె తెచ్చిన  ధర్మేంద్ర కు నా అక్షర నివాళి.
................................
అరవై ఐదు సంవత్సరాల సినీ కెరీర్ లో
మూడు వందల సినిమాల
అత్యున్నత  బాలీవుడ్ హీరో  ధర్మేంద్ర
ఆయన శరీర పటుత్వం  అభినయం ఒకప్రత్యేకత.

అత్యధిక హిందీ చిత్రాల హిట్ కలిగిన నాయకుడు
ఆయిమిలన్ కి బేలా, పూల్ ఔర్ పత్తర్, 
ఆయేదిన్ బహార్ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెంది
షోలే సినిమా లో అమితాబ్ తో కలసి నటించిన నటన
"నభూతో నభవిష్యతి"
భారదేశ హీ-మ్యాన్ గా
ఆరవై నుంచి ఎనభై వరకు
మేరాగావ్ మేరాదేశ్, సీతా ఔర్ గీతా, జీవన్ మృత్యు
రాజా జానీ, ది బర్నింగ్ ట్రైన్ అనేక చిత్రాలలో  నటించి
రాజకీయ వేత్తగా బి.జె పి ఎమ్. పి గా  పనిచేసి
విజయా ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను స్థాపించి
 బేతాబ్, ఘాయల్ ను నిర్మించి
వారసత్వంగా పుత్రులనే హీరో లు గా 
పరిచయం చేసిన ఘనత ధర్మేంద్ర
హేమమాలిని ధర్మేంద్ర  బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన జంట
నిజ జీవితంలో భార్యాభర్తలైన జంట
ఫిల్మ్ ఫేర్ లైఫ్ అచీవ్ మెంట్ మహానటులు దిలీప్ కుమార్ 
చేతులమీదుగా తీసుకుని అందం అభినయం 
మీదే అని ప్రశంసలు పొందిన వ్యక్తి.

ఏడాదిలో ఏడు విజయవంతమైన చిత్రాలను
 రెండు సార్లు అందించిన ఏకైక బాలీవుడ్ హీరో ధర్మేంద్ర
'పద్మభూషణ్ అవార్డ్' కే వన్నె తెచ్చిన అగ్రనటుడు
సుమారు తొంబది సంవత్సరాల పూర్ణాయుర్దాయం కలిగి
శ్రీరాముని దరి చేరిన 
ధర్మేంద్ర నటనకే వన్నె తెచ్చిన
మీకు నేనందిస్తున్న అక్షర నివాళి.....!!
............................

కామెంట్‌లు