జీవించిండ్రు:- డా ప్రతాప్ కౌటిళ్యా
మీరు 
జీవితాన్ని జీవించింరు
అనుభవించింరు
జన్మనిచ్చిండ్రు 
పెంచి పోషించిన్రు 
దానం చేసిండ్రు 
దాచుకున్నారు 
దర్జాగా బ్రతికిండ్రు!!!

మీరు 
జీవితాన్ని 
భక్తిశ్రద్ధలతో పూజించింరూ
దయా అనురాగాలతో 
ప్రేమించిండ్రు 
ఆశలు ఆశయాలతో 
ఆరాధించిన్రు!!!

మీరు 
జీవితాన్ని 
స్నేహం మాతృత్వంతో 
గెలిచిండ్రు 
మర్యాద మంచితనంతో 
గౌరవంగా బ్రతికించింరూ

మీరు 
జీవితాన్ని 
కలలు కోర్కెలతో 
నింపింరూ
కోపము కొట్లాటలతో 
గడిపిన్రు 
చివరికి ద్వేషాన్ని ధ్వంసం చేసి 
జీవితాన్ని ఆస్వాదించిండ్రు 
జీవితాన్ని ఆహ్వానించిన్రు 

మీరు జీవితాన్ని జీవించిండ్రు అనుభవించింరు
జన్మనిచ్చిండ్రు పెంచిన్రు పోషించిన్రు దానం చేసిండ్రు 
దర్జాగా బ్రతికిండ్రు. 

మమ్మల్ని వీడి వెళ్లిపోయిన అమ్మానాన్న అక్కమామల స్మృతిలో. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు