సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము సప్తమాశ్వాసము-41 వ రోజు
ద్రౌపదీ స్వయంవరం
స్వయంవర మండపంలో అనేక మంది రాజులు ఉపస్థితులై ఉన్నారు. వారిలో ఒకరిని వరించడానికి కృష్ణ సిద్ధంగా ఉంది. దుష్టద్యుమ్నుడు మత్స్య యంత్రం గురించి రాజులకు రాజుల గురించి కృషణకు చెప్పాడు. స్వయంవరానికి దుర్యోధనాదులు, కర్ణుడు, భూరి శ్రవుడు, సోమదత్తుడు, శృతసేనుడు, అశ్వత్థామ, శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధార రాజులు, సారణుడు, సాత్యకి, సాంబుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, కృతవర్మ, యుయుధానుడు, సుమిత్రుడు, సుకుమారుడు, సుశర్మ, సుదక్షిణుడు, సుషేణుడు, సేనాబిందుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, ఔశీనరుడు, చేకితానుడు, జనమేజయుడు, శిశుపాలుడు, జయధ్రధుడు, బృహధ్రధుడు, సత్యవ్రతుడు, చిత్రంగదుడు, శుబాంగధుడు, భగీరధుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, వత్సరాజులు, యదు, వృష్టి, భోజ, అంధక వంశ రాజులు మొదలైన రాజులతో సంభావనల కోసం
అర్జునుడు
బ్రాహ్మణ సమూహాలు వచ్చారు. అన్న బలరామునితో వచ్చిన శ్రీకృష్ణుడు పాండవులను గుర్తించాడు. కను సైగతో యదువీరులను స్వయంవరంలో పాల్గొన వద్దని ఆదేశించాడు. ఒక్కొక్కరే స్వయంవరంలో పాల్గొని విల్లు ఎక్కు పెట్టలేక పోయారు. కర్ణుడు లేచి వెళ్లి ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయాడు. తర్వాత శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు లాంటి వారు వింటిని ఎక్కుపెడుతూ మోకాళ్లమీద వాలిపోయారు.తరువాత దుర్యోధనుడు లేచి ద్రౌపదిని చూస్తూ ధనుస్సును ఎత్తి ఎక్కుపెడుతూ వ్రేల్లమధ్య వింటినారి దెబ్బతగిలి పడిపోయి సిగ్గుపడుతూ నిష్కమించాడు. తరువాత అర్జునుడు ధర్మరాజు వైపు చూసాడు. ధర్మరాజు వెళ్ళమని సైగ చేసాడు. సభాస్థలి వైపు వెళుతున్న అర్జునిని చూసి కొంతమంది ఇతనికి ఎందుకు. ఇతని వలన ఏమౌతుందని చులకనగా చూసినా కొందరు బ్రాహ్మణులు మర్యాద కాపాడాలని వేడుకున్నారు. అతి సులువుగా విల్లు ఎక్కు పెట్టి ఐదు బాణాలను వదిలి మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. రాజులంతా చేష్టలుడిగి చూస్తున్నారు. బ్రాహ్మణులు అత్యంత ఉత్సాహం చూపెట్టారు. ధర్మరాజు భీముని అర్జుననుకి తోడు ఉంచి తను విడిదికి వెళ్ళాడు. ద్రుపద రాజ పుత్రి అర్జునిని మెడలో వరమాల వేసింది.
రాజులందరినీ కూర్చి సుయోధనుడు భీమార్జునులను ఎదుర్కొనుట
రాజులందరూ ఇది చూసి అగ్రహోదగ్రులైయ్యారు. దుర్యోధనుని నాయకత్వంలో " విద్యా పటిమ చూపించి గెలుచు కున్న బ్రాహ్మణుని తప్పులేదు. కానీ దృపదుడు మనలను పిలిపించి అమర్యాద చేసాడు. ఇతని బలాన్ని అణచివేయాలి " అని అన్నాడు. బ్రాహ్మణులు అర్జునిని ప్రోత్సహిస్తూ రాజులతో కలియబడ్డారు. దృపదుడు అర్జునిని ప్రక్కన నిలబడ్డాడు. అర్జునుడు బ్రాహ్మణులను వారించి భీమునికి సైగ చేసి రాజులతో తలపడ్డాడు. ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుని ప్రవేశం అవుతుంది. శ్రీకృష్ణుడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బలరామునితో " అన్నయ్యా! పాండవులను చూసావా వెళ్ళి పోయిన వారు ధర్మరాజు నకుల సహదేవులు. చెట్టు పెరికి యుద్ధం చేస్తున్న వాడు భీముడు. బాణాలను సంధించి యుద్ధం చేసున్న వాడు అర్జునుడు " అన్నాడు. లక్క ఇంటిలో మరణించారని అనుకున్న వాళ్ళు ఇక్కడ కనపడటం బలరామునికి ఆశ్చర్యం కలిగించింది. కర్ణుడు అర్జునిని నైపుణ్యం చూసి " నన్ను ఎదిరించడం దేవేంద్రునికి, అర్జునినికి , ఉపేంద్రుడు అయిన విష్ణువుకి,పరశురామునికి తప్ప సాధ్యం కాదు నువ్వు ఎవరు? " అని అర్జునుని అడిగాడు. అర్జునుడు " నేను వీరిలో ఎవరిని కాను కాని ముందు యుద్ధం చెయ్యి " అన్నాడు. భీమడు శల్యునితో యుద్ధం చేసి ఓడించాడు. ఈ బ్రాహ్మణుల్తో యుద్ధం ఏమిటి అని రాజులు వెనుతిగారు. కానీ దుర్యోధనుడు మాత్రం " ఈ బ్రాహ్మణులు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు ? " అని విచారిస్తుండగా శ్రీకృష్ణుడు సుయోధనా, ఇతరులు చేయలేని కార్యం ఈ బ్రాహ్మణుడు చేసాడు. ద్రౌపదిని భార్యగా పొందాడు. ఇక అతని గూరించి మనకు ఎందుకు పదండి " అని వారించాడు. దుర్యోదనాదులు సరే అని వెళ్ళి పోయారు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు